ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాసిన 'డాన్సింగ్ విత్ డ్రీమ్స్' కవితా సంకలనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ కవితా సంకలనాన్ని సీఎం ఆవిష్కరించారు. సీఎస్ రాసిన కవితా సంకలనాన్ని రామ్ ప్రసాద్ అనే ప్రచురణ కర్త అచ్చువేశారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సాహిత్యాభిమానాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా అభినందించారు. కవితా సంకలనంలోని ఓ పెయింటింగ్‌ను ముఖ్యమంత్రి జగన్‌కు సీఎస్ బహూకరించారు.
ఇదీ చదవండి
TDP: 'చంద్రబాబు జోలికొస్తే ఊరుకోం..సహనం నశిస్తే రోడ్లపై తిరగలేరు'