గుంటూరులో యువతి రమ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యువతి హత్యా ఘటన, కేసు పురోగతిపై సీఎం ఆరా తీశారు. హత్య ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
‘దిశ చట్టం’ కింద దర్యాప్తు వేగంగా చేపట్టి దోషికి కఠినశిక్ష పడేలా చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిహారంగా రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని యువతి కుటుంబానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి:
Arrest: రమ్య హత్య కేసులో నిందితుడు అరెస్ట్: డీజీపీ గౌతమ్ సవాంగ్
Murder Video CC Footage: బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. సీసీ కెమరాలో దృశ్యాలు!