పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలపై మంత్రులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పథకాల వల్లే ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతున్నామని మంత్రులు జగన్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు లిబర్టీ కంపెనీ అర్హత పొందిందని మంత్రులకు అధికారులు తెలిపారు. మొదటి విడతలో 10వేల కోట్లు, రెండవ విడతలో 5వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: అగ్రవర్ణ పేదలకు గుడ్ న్యూస్... 'ఈబీసీ నేస్తం'కు కేబినెట్ ఆమోదం