రైతులకు సంబంధించి.. 3 పథకాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం నిధులను సీఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. రైతుభరోసా కింద మొత్తం 12 వందల 13 కోట్లు జమ కానున్నాయి.
రెండో విడత కింద ఖరీఫ్ పంట కోత సమయం అక్టోబర్ నెల ముగిసేలోపు, రబీ అవసరాల కోసం రూ.4 వేలు చొప్పున జమ చేస్తారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.112.7 కోట్ల వడ్డీ రాయితీ జమ చేయనున్నారు. లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు ఈ పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద 17 వందల20 రైతు గ్రూపులకు 25.55 కోట్ల రూపాయల నిధులు నేడే జమ కానున్నాయి.
ఇదీచదవండి.