విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టేడియంలో సీఎం జగన్ జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో వివిధ శాఖల శకటాల ప్రదర్శన నిర్విహించారు. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా కరోనా పరీక్షలు చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. కరోనా బాధితులకు అన్ని దశల్లో భరోసా కల్పిస్తున్నామని పేర్కొంది. వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెలీ మెడిసిన్ సౌలభ్యం కల్పించామని వివరించింది.
ఇదీ చదవండి: 'నవ భారతం కోసం 100 లక్షల కోట్లతో మౌలిక వసతులు'