హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో రాష్ట్ర సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ఈనెల 27కు వాయిదా పడింది. సీబీఐ, ఈడీ కోర్టు న్యాయమూర్తి ఇవాళ సెలవులో ఉన్నారు. కేసు తదుపరి విచారణను ఇంఛార్జ్ న్యాయమూర్తి ఈనెల 27కి వాయిదా వేశారు.
నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోని ఈడీ కేసు నవంబరు 9కి వాయిదా పడింది. అరబిందో, హెటిరో సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించిన ఈ కేసును కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. నవంబరు 5న హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపిన మేరకు.. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు నవంబరు 9కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: