రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమోదాన్ని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ప్రభుత్వ ఆమోదంతో గురువుల బదిలీలకు సంబందించిన ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశముంది. 29-2-2020 నాటికి రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులంతా బదిలీలకు అర్హులు కానున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల అనంతరం వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీల ప్రక్రియను చేపట్టనున్నారు. వివిధ కారణాల రీత్యా గడచిన మూడేళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది.
ఇదీ చదవండి: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల