ETV Bharat / city

CJI: యాదాద్రీశుడిని ద‌ర్శించుకున్న సీజేఐ దంప‌తులు - CJI JUSTICE NV RAMANA latest news

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (cji nv ramana) దంపతులు.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి (yadadri temple)లో సీజేఐ దంపతులకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఘనస్వాగతం పలకగా... అర్చకులు ఆలయంలోకి పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం వారు బాలాలయంలో యాదాద్రీశుడిని దర్శించుకుని... ప్రత్యేక పూజలు చేశారు.

యాదాద్రీశుడిని ద‌ర్శించుకున్న సీజేఐ దంప‌తులు

author img

By

Published : Jun 15, 2021, 10:46 AM IST

యాదాద్రీశుడిని ద‌ర్శించుకున్న సీజేఐ దంప‌తులు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా.. యాదాద్రి ల‌క్ష్మీన‌రసింహ‌స్వామిని(sri lakshmi narasimha swamy) జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ(Justice NV Ramana) దంప‌తులు ద‌ర్శించుకున్నారు. హైద‌రాబాద్ నుంచి ఈ ఉద‌యం బ‌య‌లుదేరి యాదాద్రి వెళ్లారు. యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద సీజేఐకి... మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి(indrakaran reddy, jagadish reddy) ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

ఆల‌య అర్చకులు సీజేఐ దంప‌తుల‌కు పూర్ణకుంభంతో ఆల‌యంలోకి స్వాగ‌తించారు. దర్శనం అనంతరం బాలాలయంలో జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వారికి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం తర్వాత రమణ దంపతులు ఆలయ పునర్‌నిర్మాణ పనులను పరిశీలించారు.

ప్రధానాలయానికి ఉత్తర దిశలో నిర్మాణ పనులను వీక్షించారు. ప్రెసిడెన్షియల్‌ విల్లా కాంప్లెక్స్(presidential villa complex) పనులు, ఆలయ నగరిని సందర్శించారు. సీజేఐ పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:

Nominated MLC's: 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు..గవర్నర్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.