ETV Bharat / city

Cine Producers Meet Nani: మంత్రి పేర్ని నానితో.. సినీ పరిశ్రమ ప్రతినిధుల సమావేశం

మంత్రి పేర్ని నానితో సినీపరిశ్రమ ప్రతినిధులు సచివాలయంలో సమావేశమయ్యారు.ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అంశంపై మంత్రి పేర్ని నానితో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీకి ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో పాటు పంపిణీదారు అలంకార్‌ ప్రసాద్ కూడా హాజరయ్యారు.

మంత్రి పేర్ని నానితో సినీ పరిశ్రమ ప్రతినిధుల సమావేశం

author img

By

Published : Oct 29, 2021, 3:24 PM IST

మంత్రి పేర్ని నానితో.. సినీపరిశ్రమ ప్రతినిధులు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీకి ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో పాటు పంపిణీదారు అలంకార్‌ ప్రసాద్, బన్నీ వాసు, వంశీ హాజరయ్యారు. ఆన్​లైన్​ టికెట్ల విక్రయాలకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అంశంపై సినీ ప్రతినిధుల బృందం చర్చలు జరిపినట్లు సమాచారం. టికెట్ల జారీకి సంబంధించిన సాంకేతిక అంశాలపైనా భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నటుడు నాగార్జున కూడా నిన్న తాడేపల్లికి వచ్చి సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.

మరోవైపు కొవిడ్ సమయంలో సినిమా థియేటర్లకు ప్రభుత్వం కల్పించిన విద్యుత్ ఫిక్స్​డ్​ ఛార్జీల వెసులుబాటు అంశాన్ని పరిశీలించాల్సిందిగా సినీ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా డిస్కమ్​లు భారీగా జరిమానాలు వసూలు చేసేందుకు నోటీసులు జారీ చేయటంతో వాటిని రద్దు చేయాల్సిందిగా థియేటర్ యాజమాన్యాలు కోరుతున్నాయి.

ఇదీ చదవండి

AP Cabinet decisions : ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం...త్వరలో ఆర్డినెన్స్‌ జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.