ETV Bharat / city

కల్తీసారా విక్రేతలు వైకాపా నాయకులే.. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు - tdp chief chandrababu

రాష్ట్రంలో వైకాపా నాయకులే కల్తీసారా విక్రయిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన సీఎం జగన్.. రాష్ట్రంలో మద్యం, నాటుసారా ఏరులై పారిస్తున్నారన్నారు. జంగారెడ్డి గూడెంలో కల్తీసారాకు బలైన మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

babu
babu
author img

By

Published : Mar 14, 2022, 9:35 AM IST

Updated : Mar 15, 2022, 7:44 AM IST

కల్తీసారా విక్రేతలు వైకాపా నాయకులే: చంద్రబాబు

ఎన్నికల్లో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైకాపా పాలనలో రాష్ట్రంలో మద్యం, నాటుసారా ఏరులై పారుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కల్తీసారాను స్వయంగా వైకాపా నేతలే విక్రయిస్తున్నారన్నారని ఆయన ఆరోపించారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన చంద్రబాబు.. కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అనంతరం వారితో ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

"మద్యం, నాటుసారా ఏరులై పారుతోంది. కల్తీసారా వైకాపా నాయకులే విక్రయిస్తున్నారు. మద్యం తయారీ నుంచి విక్రయం వరకు జగన్ చేస్తున్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కల్తీ నాటుసారాతో చనిపోయిన వారిని సహజ మరణాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటన చేయటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ప్రభుత్వ అక్రమ నాటుసారా, మద్యం వ్యాపారం వల్లే 36 మంది బలయ్యారు. కల్తీ సారా నియంత్రించే వరకు పోరాటం చేపడతా. "- చంద్రబాబు, తెదేపా అధినేత

రాష్ట్రంలో మద్యం తయారీ నుంచి విక్రయం వరకు సీఎం జగనే చేస్తున్నారన్నారని చంద్రబాబు ఆరోపించారు. కల్తీ సారా నియంత్రించేవరకూ తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఎందరిని జైలులో పెట్టినా కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. 26 బాధిత కుటుంబాలకు తమ పార్టీ తరఫున ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ఇక్కడికి రాకుంటే.. పది లక్షలిస్తారా?
చంద్రబాబు సమావేశానికి వెళ్లకుంటే పది లక్షలు ఇస్తామని అధికారులు మృతుల కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ‘తాడోపేడో తేల్చుకోవడానికొచ్చా. చెప్పిన అబద్ధాలను, తిన్న డబ్బులను కక్కిస్తా. ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగి, ఇలా పేదల జీవితాలతో ఆడుకుంటారా? ఎన్నికల ముందు మద్యపాన నిషేధమన్నారు. సీఎం అయ్యాక రేట్లు పెంచేసి జగన్‌ బ్రాండ్లు తెచ్చారు. ఇదేమంటే మద్యపానాన్ని నియంత్రించేందుకన్నారు. అయినా తాగేవాళ్లు తగ్గలేదు. నాటుసారా తాగి చనిపోతున్నారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా వ్యాపారంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు వాటా ఉంది. వారి ధనదాహానికి మనుషుల ప్రాణాలు పోవాలా? వారు నర హంతకులు’ అని దుయ్యబట్టారు. ‘బాధితుల్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రారా? మీ కుటుంబంలో ఇలాగే జరిగితే ఊరుకుంటారా? ఫుడ్‌ పాయిజన్‌ అయిందని, అనారోగ్యంతో మరణించారని అంటున్నారు. వీటితో పురుషులే చనిపోతారా? మహిళలు చనిపోరా?’ అని ప్రశ్నించారు.
‘చిల్లర దుకాణాల్లోనూ అంగీకరించే యూపీఐ పేమెంట్లను మద్యం దుకాణాల్లో ఎందుకు అంగీకరించట్లేదు? బిల్లులెందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే.. జగన్‌కు వాటాలు వెళ్లాలి. నాసిరకం బ్రాండ్లన్నీ ఇక్కడ ఉంచి.. పక్క రాష్ట్రాల నుంచి అక్రమ రవాణాతో మద్యం తెచ్చి వైకాపా నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. సారా వ్యాపారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను హరించి, ఆడవాళ్ల తాళిబొట్లు తెంచే అధికారం మీకెవరిచ్చారు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌ పెంపుడు కుక్కలు తనపై చేసే విమర్శలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘తెదేపా లేకుంటే ఈ దొంగలు సారా బాధితుల్ని పట్టించుకునేవారా? ఇంకో పది మందిని చంపేసి సహజ మరణాలనేవారు. నేనిక్కడికి దృఢ సంకల్పంతో వచ్చా. కల్తీ సారా పోయేవరకు వదలిపెట్టను’ అని తేల్చి చెప్పారు. ఒకరి చెప్పుచేతల్లో ఉంటూ పనిచేయడానికి మీకు బాధగా లేదా? అని పోలీసులను ప్రశ్నించారు.

"ఎందరిని జైలులో పెట్టినా కేసులకు భయపడం. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తెదేపా ఉద్యమం. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. కల్తీసారా వల్ల 26 కుటుంబాలు వీధిన పడ్డాయి. అనారోగ్యంతో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు. పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయింది. అభద్రత మధ్య ప్రజలు బతుకుతున్నారు."- చంద్రబాబు, తెదేపా అధినేత

బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. కల్తీ నాటుసారా తాగడం వల్లే తమ వారు మృతి చెందారని తెలిపారు. దీని వల్ల తమ కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయి వీధిన పడ్డామని కన్నీటి పర్యంతమయ్యారు. నాటుసారా మహమ్మారి వల్ల తమ వారు చనిపోతే.. ప్రభుత్వ పెద్దలు సహజ మరణాలని ప్రకటించడం తమను మరింత కృంగదీసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్తీ నాటుసారా, అక్రమ మద్యం విక్రయాలను నియంత్రించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రూ.లక్ష చొప్పున పరిహారం
విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ అనే ప్రైవేటు సంస్థలో ప్రమాదం జరిగి చనిపోతే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వమే చేసిన హత్యలకు ఎంత ఇస్తుందో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. ‘బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున రూ.26 లక్షలు తెదేపా తరఫున ఇస్తాం. విరాళాలతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి బాధితుల పిల్లలను ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున చదివిస్తాం. ప్రభుత్వం పరిహారం ఇవ్వకుంటే మేం వచ్చాక రూ.25 లక్షల చొప్పున ఇస్తాం’ అని మాటిచ్చారు. చంద్రబాబు ప్రకటనకు స్పందించి పలువురు అక్కడే విరాళాలు ఇవ్వగా సుమారు రూ.15 లక్షలు పోగయ్యాయి. కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన నలుగురు చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించలేదని చంద్రబాబు విమర్శించారు. మృతులు మింటే మధు, జగతా శ్రీను, పేరుబోయిన రామాంజనేయులుతోపాటు మరో కుటుంబానికి రూ.50వేల చొప్పున అందజేశారు.

బీమా, పింఛను తొలగిస్తామన్నారు: వెంకటలక్ష్మి దుర్గ
‘నా భర్త పోశయ్య కల్తీ సారావల్లే చనిపోయారు. కూలికి వెళ్తేనే మాకు పూట గడిచేది. నాకు ఇద్దరు పిల్లలు. వారినెలా పెంచాలో అర్థం కావట్లేదు. గతంలో బ్రాందీ తాగే ఆయన ధరలు పెంచడంతో సారాకు అలవాటుపడ్డారు. ప్రభుత్వం తరఫున మమ్మల్ని పలకరించిన వాళ్లులేరు. మట్టి ఖర్చులు తెదేపానే అందించింది. ఆదివారం రాత్రి మమ్మల్ని బెదిరించారు. సోమవారం తెల్లవారుజామున నాలుగింటి నుంచి ఇంటి దగ్గరే కాపలా కాశారు. ‘చంద్రబాబు నాలుగు మాటలు చెప్పి వెళ్తారు. అంతకుమించి ఏమీ చేయరు. చేయాల్సింది ప్రభుత్వమే. చూసి మాట్లాడండి. లేకుంటే పింఛను రాదు. రేషన్‌ కట్‌ చేస్తాం. బీమా రాదు’ అని భయపెడుతున్నారు. మాకు భయంగా ఉంది. రక్షణ కల్పించండి.’

రూ.100కే రెండు ప్యాకెట్లు: వెంపల లావణ్య
‘అంతకు ముందు బ్రాందీ, విస్కీ తాగే మా ఆయన అనిల్‌.. రేట్లు పెంచేయడంతో రూ.100కే రెండు ప్యాకెట్లు దొరికే నాటుసారాకు అలవాటుపడ్డారు. కల్తీ సారా తాగి చనిపోతే.. పది రోజులపాటు అన్నం తిననందుకే చనిపోయాడంటూ ఆసుపత్రిలో అబద్ధం చెబుతున్నారు. ఆయనకు అన్నం పెట్టేది నేనే. నాకు తెలీదా ఆయన తిన్నదీ లేనిదీ? ఇప్పుడు మా కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తప్పుడు నివేదికతో మాకు అన్యాయం చేశారు.’

నాటుసారా వల్లే చనిపోయాడు: పితాని లక్ష్మి
నాటుసారా వల్లే నా కుమారుడు రమణ చనిపోయారు. తండ్రిగా, తోబుట్టువుగా రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చిన జగన్‌ నా కోడలి తాడు తెంపారు. ఆయన కేసులు రద్దు చేయించుకొని సుఖంగా ఇంట్లో ఉన్నారు. వాళ్ల కుటుంబంలో జరిగితే ఇలాగే ఉంటారా? 28, 29 వార్డుల్లోని నాయకులు ఆదివారం రాత్రి ఒంటిగంటకు ఇంటికొచ్చి బెదిరించారు. మా కోడలిని ఉదయం ఏలూరు తీసుకెళ్లారు.

18కి చేరిన మృతుల సంఖ్య..
జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు భయపెడుతూనే ఉన్నాయి. శనివారం మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించడంతో ఐదు రోజుల వ్యవధిలో మృతుల సంఖ్య 18కి చేరింది.

ఇదీ చదవండి:
Jangareddygudem Deaths: ప్రాణాలు తీసిన 'సారా'క్షసి!.. శోకసంద్రంలో బాధిత కుటుంబాలు

Last Updated : Mar 15, 2022, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.