ETV Bharat / city

Chief Whip Srikanth reddy: 'చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ సలహాదారునిగా వ్యవహరిస్తున్నారు'

author img

By

Published : Jul 30, 2021, 10:54 PM IST

సాగునీటిపై అభ్యంతరం తెలుపుతూ కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం రాసే లేఖలన్నీ తెదేపా కార్యాలయం నుంచే తెరాస కార్యాలయానికి వెళ్తున్నాయని వైకాపా విమర్శించింది. తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ సలహాదారునిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని..ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.

chief whip srikanth reddy fires on chandrababu over rayalaseema lift irrigation project
'చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ సలహాదారునిగా వ్యవహరిస్తున్నారు'

తెలంగాణ(telangana) ప్రభుత్వానికి ఇరిగేషన్ సలహాదారునిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు(tdp chief chandrababu) వ్యవహరిస్తున్నారని.. వైకాపా(ysrcp) ఆరోపించింది. సాగునీటిపై అభ్యంతరం తెలుపుతూ కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం రాసే లేఖలన్నీ తెదేపా కార్యాలయం నుంచే తెరాస(trs) కార్యాలయానికి వెళ్తున్నాయని విమర్శించింది. చంద్రబాబే వాటిని రాయిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్(chief whip) గడికోట శ్రీకాంత్ రెడ్డి(srikanth reddy) ఆరోపించారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులకు సహకరించిన చంద్రబాబు.. పోతిరెడ్డిపాడు(pothireddypadu) నుంచి వరద నీటిని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. గతంలో పోతిరెడ్డిపాడును వైఎస్ఆర్ చేపడితే.. దేవినేని ఉమాతో చంద్రబాబు దీక్షలు చేయించారని, ఇప్పుడు సీఎం జగన్(cm jagan) రాయలసీమ లిఫ్టు(rayalaseema lift irrigation project) పెడుతుంటే.. ప్రకాశం జిల్లా నేతలతో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లేఖలు రాయిస్తున్నారన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకునేందుకే రాయలసీమ లిఫ్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

రాయలసీమ ప్రాజెక్టుపై.. తెెదేపా వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలు, ప్రకాశం, నెల్లూరుకు.. కృష్ణా నీరు తీసుకునేందుకే రాయలసీమ లిఫ్టును నిర్మిస్తున్నామని తెలిపారు. ఇదే విషయాన్ని మేము చెబుతున్నా.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా తెదేపా వ్యవహరిస్తుందన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు గెజిట్​లో పెట్టే వరకు పోరాటం విరమించేది లేదన్నారు. సాగునీటి పై రాజకీయం చేయవద్దని చంద్రబాబును కోరుతున్నామని.. శ్రీకాంత్ అన్నారు.

రాయలసీమకు తీవ్ర ద్రోహం చేసింది వైకాపా ప్రభుత్వమే: సయ్యద్ రఫీ
తెదేపా ప్రభుత్వ హయాంలో.. రాయలసీమకు చేసిన అభివృద్ధిపై గడికోట శ్రీకాంత్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ సవాల్ విసిరారు.

“నీటి వనరులపై రాష్ట్ర అధికారాలన్నీ కేంద్రానికి తాకట్టు పెట్టి.. రాయలసీమకు తీరని ద్రోహం చేసింది వైకాపా ప్రభుత్వమే. జగన్ రెడ్డి తన ఆస్తుల కోసం కేసీఆర్ కు, కేసుల కోసం మోదీకి భయపడి రాష్రానికి తీవ్ర అన్యాయం చేస్తుంటే, వైకాపా నేతలు చంద్రబాబుని విమర్శించటం సిగ్గు చేటు. ఏపీ నీటి వాటాను తెలంగాణ వాడుకుంటున్నా, కేంద్రం విభజన హామీలు అమలు చేయకపోయినా నోరు తెరవలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది.” అని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

Godavari River Management Board: ఆగస్టు 3న సమన్వయ కమిటీ భేటీ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.