ETV Bharat / city

తెలంగాణ: ఐరన్​ బాక్స్​తో కరోనాకు చెక్ పెడుతున్న పోలీసులు - Check the corona with the ironbox in kodada dsp office

తెలంగాణ రాష్ట్రం కోదాడలో పోలీసులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కార్యాలయానికి వచ్చే ఫిర్యాదుల పేపర్లను ఇస్త్రీతో ఐరన్​ చేసిన తర్వాతే స్వీకరిస్తున్నారు. కరోనా నియంత్రణ దిశగా ఈ పని చేస్తున్నామన్నారు.

check the corona with the ironbox in kodada dsp office
తెలంగాణ: ఐరన్​ బాక్స్​తో కరోనాకు చెక్ పెడుతున్న పోలీసులు
author img

By

Published : Jul 11, 2020, 4:33 PM IST

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కరోనా వైరస్​ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో.. డీఎస్పీ రఘు వినూత్నంగా ఆలోచించారు. ఫిర్యాదుదారులు ఇచ్చే పత్రాలను ఇస్త్రీ పెట్ట ద్వారా ఐరన్​ చేస్తే.. పేపర్​పై ఉన్న వైరస్​ చనిపోతుందని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా కార్యాలయానికి వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేయించిన తర్వాతనే సిబ్బంది స్వీకరించేలా చర్యలు తీసుకున్నారు.

శానిటైజర్ల ధరలు అధికంగా ఉండటం, వాటిని ఉపయోగించినప్పటికీ సమయం వృథా అవడం వల్ల ఈ ఆలోచన వచ్చిందని డీఎస్పీ రఘు వెల్లడించారు. బయట నుంచి వచ్చే సిబ్బందికి ఎప్పటికప్పుడు కాళ్లకు, చేతులకు శానిటైజర్​ చేసుకుని డీఎస్పీ కార్యాలయం లోపలికి సిబ్బంది వెళ్తున్నారని వివరించారు. కరోనా వైరస్ నియంత్రణలో కోదాడ పోలీసులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొని అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని... ప్రజలు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ప్రాణం పోవటమే తప్ప వ్యాక్సిన్ లేదు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.