ETV Bharat / city

తెదేపా నేతలపై.. అక్రమ కేసులు ఎత్తివేయాలి: డీజీపీకి చంద్రబాబు లేఖ

విగ్రహాల ధ్వంసం ఘటనలపై డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు.

తెదేపా నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.. డీజీపీకి చంద్రబాబు లేఖ

author img

By

Published : Apr 7, 2021, 7:03 PM IST

దేవాలయాల్లో దాడులకు పాల్పడుతున్న అసలు నేరస్తుల్ని పోలీసులు పట్టుకోవాలని.. కుప్పం నియోజకవర్గంలో తెదేపా నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గొనుగునూరు గ్రామ పంచాయితీ పేటగుట్టలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ధ్వంసం ఘటన పరిణామాలపై డీజీపీకి లేఖ రాశారు. 'అధికార పార్టీతో కుమ్మక్కైన ఓ వర్గం పోలీసులు.. రాజకీయ కక్షసాధింపులో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలి. ప్రార్థనా స్థలాలకు రక్షణ కల్పించి వాటిని కాపాడాలి. రాజకీయాలకు అతీతంగా పోలీసులు చర్యలు తీసుకుంటేనే దాడులు ఆగి.. పోలీసులపై నమ్మకం ఏర్పడుతుంది' అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే 2019 జూన్ నుంచి రాష్ట్రంలో ప్రార్థనా స్థలాలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు లేఖలో తెలిపారు. 'ప్రభుత్వ ఉదాసీనతకు పేట్టగుట్ట ఘటనా తాజా ఉదాహరణ. నేరస్తులను పట్టుకోని పోలీసులు న్యాయం కోసం డిమాండ్ చేస్తున్న తెదేపా నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ అభ్యర్థులు 40 మందిని అక్రమంగా అరెస్టు చేసి భోజనం కూడా పెట్టకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. 160 సెక్షన్ కింద వారికి నోటీసులు జారీ చేయటం అర్థ రహితం. వలస పాలనను తలపించేలా జరుగుతున్న పరిణామలను తెలుసుకునే యత్నం చేసిన ప్రతిపక్ష నాయకులపైనా కేసులు పెట్టారు. కుప్పం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైన పలువురు నాయకుల్ని గుడుపల్లి పోలీస్ స్టేషన్​లో ఉంచారు' అని చంద్రబాబు లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

రేపే పరిషత్ ఎన్నికలు: ఇప్పటివరకు ఏం జరిగింది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.