వైకాపా ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తూ.. అందరికీ అచ్చెన్నాయుడు ఆదర్శంగా నిలిచారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. బెయిల్పై విడుదలైన అచ్చెన్నను.. చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. అక్రమంగా కేసులు నమోదు చేసి బలహీనవర్గాలకు చెందిన నేతలను వేధిస్తున్న ప్రభుత్వానికి.. ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని చంద్రబాబు అన్నారు.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నపై.. జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలో.. తెదేపా నేతలను ఎదుర్కోలేక పోలీసు వ్యవస్థను స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలతో వేధిస్తున్నారన్నారని ఆరోపణలు చేశారు. ప్రజా క్షేత్రంలో పోరాడే నేతలే చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్పై విడుదల