రాజ్యాంగ గౌరవం, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకమని చంద్రబాబు అన్నారు. సదుద్దేశంతో ఎన్నికలు వాయిదా వేసిన ఎస్‌ఈసీ తొలగింపు రాజ్యాంగ ఉల్లంఘనేనని గుర్తు చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం దుందుడుకు, పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలని హితవు చెప్పారు. ఎస్‌ఈసీ తొలగింపు వెనుక సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని కాపాడాలని కోరారు.
ఇదీ చదవండి: నిమ్మగడ్డ వ్యవహారం: తొలగింపు నుంచి తిరిగి నియమించేదాకా....