రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను రాష్ట్రంలో కాలరాస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ దళిత విద్యార్ధి, రిసెర్చ్ స్కాలర్ ఆరేటి మహేష్ ఉన్నత చదువులకు ఆటంకాలు కల్పించడం విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు. ఈ విధమైన కక్షసాధింపు గర్హనీయమన్నారు.
చదువుకు అడ్డుపడటం ఫ్యాక్షనిస్టుల దుష్ట సంస్కృతిగా పేర్కొన్నారు. దళిత వైద్యులపై అమానుషాలు, దళిత జడ్జిపై రాళ్లదాడి, దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళితుల భూములు బలవంతంగా లాక్కోవడం.. వంటి ఈ పాలకుల గతి తప్పిన, మతిమాలిన చర్యలను దళిత సమాజమే నిగ్గదీయాలన్నారు. నిరాహార దీక్ష చేస్తున్న మహేష్‌కి తక్షణమే న్యాయంచేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...
'ప్రమాదం ఆవేదన కలిగించేదే.. అయినా సానుకూల దృక్పథంతో వ్యవహరించండి'