ETV Bharat / city

CBN: ఆ ఎన్నికల్లో వైకాపాను ఓడిస్తేనే.. రాష్ట్రానికి రక్షణ: చంద్రబాబు - వైకాపాపై చంద్రబాబు కామెంట్స్

జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 13 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు షెడ్యూడ్ విడుదలైందున ఓటర్లు ఏకమై వైకాపాను ఓడిస్తేనే వారి రివర్స్ పాలనకు గండిపడుతుందన్నారు.

ఆ ఎన్నికల్లో వైకాపాను ఓడిస్తేనే వైకాపా రివర్స్ పాలనకు బ్రేక్

author img

By

Published : Nov 1, 2021, 4:58 PM IST

మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాను ఓడిస్తేనే ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 13 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు షెడ్యూడ్ విడుదలైన నేపథ్యంలో తెదేపా అధినేత అధ్యక్షతన సమావేశం నేతలు సమావేశమయ్యారు. ఓటర్లు ఏకమై వైకాపాను ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండిపడుతుందని పిలుపునిచ్చారు.

అమరావతి రైతులు చేపట్టిన 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' యాత్రకు తెదేపా సంపూర్ణ మద్దతు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి అయిన అమరావతిని నిరుపయోగం చేశారని ఆయన మండిపడ్డారు. జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వ డొల్లతనం బట్టబయలైందన్నారు. గంజాయి ఉందన్న వారిపై కేసులు పెట్టి, దాడులు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. 3 లక్షల కిలోల గంజాయి పట్టుబడిందని పోలీసులు చెబుతుంటే..,25 వేల ఎకరాల్లో రూ.8 వేల కోట్ల గంజాయి సాగవుతోందని ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించిందన్నారు. మద్యనిషేధం పేరుతో సొంత, నకిలీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దారని ఆరోపించారు. మహిళల పుస్తెలు కాపాడుతానని హామీ ఇచ్చి.. నేడు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తెదేపా పోరాటం చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎయిడెడ్ స్కూళ్ల ఆస్తుల కోసం బడి పిల్లలను బజారుకీడ్చారని, తెదేపా అధికారంలోకి వస్తే..యథావిధిగా ఎయిడెడ్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు.

ప్రజలతో కలిసి ఉద్యమం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైకాపా ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తోందని తెదేపా నేతలు ఆక్షేపించారు. జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో రైతుల అవస్థలు పడుతున్నారని, దొంగ బ్యాంకు గ్యారంటీల మోసంపై విచారణ జరిపించాలన్నారు. రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణంపై విచారణ జరపాలన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నేతలు ఆరోపించారు. ధరలు తగ్గించకుంటే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అప్పుల కోసం గవర్నర్ సార్వభౌమాధికారాలనూ తాకట్టు పెట్టారని విమర్శించారు.

సామాజిక న్యాయం ఓ బూటకం
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అసలు దోషుల్ని వదిలేశారని నేతలు ఆరోపించారు. మంత్రి నారాయణ స్వామి నుంచి వాణిజ్య పన్నుల శాఖను తొలగింపు దుర్మార్గమన్నారు. వైకాపాలో సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి అని విమర్శించారు. ఉపాధి కూలీలకు నెలల తరబడి వేతనాలివ్వకపోవడం దుర్మార్గమని, వెంటనే నీరు-చెట్టు, నరేగా బిల్లులు విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు.

పొట్టి శ్రీరాములుకు చంద్రబాబు నివాళి
అంతకుముందు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములకు చంద్రబాబు నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్​లోని తన నివాసంలో ఈ మేరకు పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

ఇవీ చదవండి

NOTIFICATION : రాష్ట్రంలో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌

maha padayatra: అమరావతిని కాపాడుకోకపోతే రాష్ట్ర భవిష్యత్ అంధకారమే: చంద్రబాబు

AMARAVATHI PADAYATHRA : మరో ముందడుగు... ప్రారంభమైన రైతుల మహాపాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.