ETV Bharat / city

"వైకాపా ఆగడాలపై పోలీసుల ఉదాసీనత.. ఎస్ఈసీ స్పందించాలి"

కుప్పంలోని ఘటనలపై ఎస్‌ఈసీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 41 గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని లేఖలో పేర్కొన్నారు.

chandrababu letter to sec over kuppam issue

author img

By

Published : Feb 15, 2021, 4:56 PM IST

చిత్తూరు డీసీసీ అధ్యక్షుడు సురేశ్‌బాబుపై హత్యాయత్నం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు. ఈ విషయంపై స్పందించి... కుప్పంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరుతూ.. ఎస్​ఈసీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యలపై విచారణ జరపాలన్నారు.

'తెదేపా మద్దతుతో పోటీ చేస్తే.. పొలాలు నాశనం చేస్తారా?'

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతున్నా... వైకాపా నేతలకు సిగ్గు రావట్లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. పులివెందుల నియోజకర్గంలో పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుతో పోటీ చేసిన నేతల పొలాలను నాశనం చేయటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. విధ్వంసం, విద్వేషాలతో రాష్ట్రాన్ని వైకాపా నేతలు రావణకాష్టం చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు తెదేపా నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.

'వారిపై చర్యలు తీసుకోవాలి'

స్థానిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులకు పెరుగుతున్న ప్రజా మద్దతు చూసి ఓర్వలేకే అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో పొలాన్ని నాశనం చేయడం వైకాపా నేతల అభద్రతాభావానికి అద్దం పడుతోందన్నారు. "పోలీసుల ఉదాసీనత వల్లే వైకాపా గూండాల ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి. క్రోసూరు మండలం ఆవులవారిపాలెం పంచాయతీలో అక్రమంగా అదుపులోకి తీసుకున్న తెదేపా నేతలను వెంటనే విడుదల చేయాలి. పులివెందులలో పొలాలను నాశనం చేసిన వారినిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అని ఎస్ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు నివేదించారు.

ఇదీ చదవండి:

'కావాలనే వాళ్ల నామినేషన్లు తిరస్కరిస్తున్నారు.. న్యాయం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.