ETV Bharat / city

బీసీ జనార్దన్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ - బీసీ జనార్దన్​ రెడ్డి అరెస్టుపై చంద్రబాబు లేఖ వార్తలు

బీసీ జనార్దన్‌రెడ్డి అరెస్టుపై డీజీపీ గౌతం సవాంగ్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బీసీ జనార్ధన్‌రెడ్డిపై అక్రమ కేసు పెట్టారని పేర్కొన్నారు. జనార్ధన్‌ అనుచరులను ఇంతవరకు కోర్టులో హాజరుపరచలేదని తెలిపారు.

బీసీ జనార్దన్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ

author img

By

Published : May 25, 2021, 2:48 PM IST

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలోని బనగానపల్లి పోలీస్‌స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి అతని మద్దతుదారులపై అక్రమ కేసు బనాయించారని లేఖలో ఆరోపించారు. జనార్ధన్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన వ్యక్తి, అతని అనుచరులైన వైకాపా గూండాలే దాడి చేయడానికి వెళ్లారన్నారు. జనార్ధన్ రెడ్డి, అతని మద్దతుదారులు వారిని ప్రతిఘటించినందుకు వారిపై అక్రమ కేసు నమోదు చేశారని లేఖలో పేర్కొన్నారు.

2021 మే 23వ తేదీ అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేశారన్న చంద్రబాబు.., అరెస్టు చేసిన వారిలో జనార్ధన్ రెడ్డి, మురళి, రమణలను 24 గంటల్లో కోర్టులో హాజరుపరిచారని తెలిపారు. కానీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న మరో ఆరుగురు జనార్ధన్ రెడ్డి మద్దతుదారులను 24 గంటల్లో కోర్టులో హాజరుపరచలేదన్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని 24గంటలలోపు కోర్టులో హాజరుపర్చాలనే నియమం ఉన్నప్పటికీ, చట్టవిరుద్ధంగా వారిని పోలీసు నిర్బంధంలో ఉంచారని ఆక్షేపించారు. వారిలో శ్రీను, దివాకర్, విజయ్ రెడ్డి, నరసింహ, పెద్దా హుస్సేని, అత్తర్ షాహిద్ లు ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఇరికించటానికి.. బాధితులను బలవంతంగా ఒప్పించడానికి చట్టవిరుద్ధంగా ఆరుగురిని పోలీసు కస్టడీలో ఉంచినట్లు తెలుస్తోందన్నారు. ఇటువంటి అక్రమ నిర్బంధాలు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య నిబంధనలకు విరుద్ధం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. అందువల్ల, అక్రమంగా అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్​లో ఇటువంటి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేయకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీని విజ్ఞప్తి చేశారు.

కేసులు పెట్టడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది

తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే వైకాపా ప్రభుత్వం పనిగా పెట్టుకుందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బీసీ జనార్ధన్ రెడ్డి అరెస్టుపై కర్నూలు నాయకులతో ఆయన టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. పోలీసులు ఉన్నది దొంగలకు రక్షణ కల్పించడానికా? అని చంద్రబాబు నిలదీశారు. బీసీ జనార్ధన్ రెడ్డిపై, తెదేపా నాయకులపై పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. కర్నూలులో కరోనాతో, బ్లాక్ ఫంగస్ తో ప్రజలు చనిపోతుంటే.. వైకాపా రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తుందని దుయ్యబట్టారు. ఆదివారం ఎనిమిది మంది తెదేపా నాయకులను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటికీ ఆరుగురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని ఆరోపించారు. బీసీ జనార్ధన్ రెడ్డి విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడుతామని తేల్చిచెప్పారు.

వైకాపా దుర్మార్గాలపై కరోనా నిబంధనలు పాటిస్తూ వర్చువల్ నిరసనలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలీసులు చేస్తున్న దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. హైకోర్టు డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అని వ్యాఖ్యానించినా సిగ్గురాలేదని మండిపడ్డారు. ఈ టెలీకాన్ఫరెన్స్​లో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి అఖిల ప్రియ, వెంకటరెడ్డి, ప్రతాప్ రెడ్డి, తిక్కారెడ్డి, జాఖిర్ హుస్సేన్, నరసింహారెడ్డి, రామలింగారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వలస జీవితాలు.. సీలేరు నదిలో గల్లంతు.. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.