కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ అలుపెరగకుండా పోరాడుతుంటే... ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు. కొవిడ్-19 నివారణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యనించారు. మాస్కులు, కిట్లు లేవని ప్రతిపక్ష నేతలు నిందలు వేయటం సరికాదన్నారు. తెదేపా నేత అయ్యన్నపాత్రుడి డైరెక్షన్లో డాక్టర్ సుధాకర్.. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. దేశం మెచ్చుకునే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
ఇదీచదవండి