'భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ప్రధాని శంకుస్థాపన చేసిన ఐకానిక్ సెంట్రల్ విస్టా నిలుస్తుంది. వేర్వేరు ప్రాంతాల్లోని ప్రభుత్వ శాఖలన్నింటినీ ఒకే చోటకు చేర్చడం ద్వారా రెడ్ టేపిజానికి అడ్డుకట్టవేసే కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థకు ఇది నాంది పలకనుంది. అమరావతిలోనూ ఇదే తరహాలో అన్ని అన్ని ప్రభుత్వ భవన సముదాయాలు ఒకేచోట ఉండేలా రూపకల్పన చేశాం.' అని చంద్రబాబు అన్నారు. 'సెంట్రల్ స్పైన్'గా రాజ్ భవన్, శాసన పరిషత్, హైకోర్ట్, సచివాలయాలు, శాఖాధిపతుల కార్యాలయాలు ఒకే చోట వచ్చేలా ప్రణాళికలు చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతిని దేశానికే చెరగని సంపదగా నిర్మాణం చేపట్టాం. ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల అదంతా నాశనం అయ్యింది." అని చంద్రబాబు మండిపడ్డారు.
ఇదీ చదవండి: పార్లమెంట్ నూతన భవనానికి శంకుస్థాపన