కాకినాడలో తెదేపా నిజనిర్థారణ కమిటీని అడ్డుకోవడాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఆసుప్రత్రి వద్ద తెదేపా నేతలపై పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు. వైకాపా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును ప్రభుత్వం పక్కదోవపట్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. సుబ్రహ్మణ్యం మృతి ఘటనలో నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని.. వాటిని తేల్చేందుకే తెదేపా నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేసినట్ల చంద్రబాబు చెప్పారు.
హత్య కేసుకు సంబంధించి కాకినాడ జీజీహెచ్ వద్ద తెదేపా నేతలను నిలువరించే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య విషయంలో నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ను అరెస్టు చేసే వరకు తెదేపా పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పోలీసుల దాడిలో అస్వస్థతకు గురైన పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. రాజు ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా తీశారు.
ఇదీ చదవండి: