ETV Bharat / city

'వైకాపా ఎంపీ అల్లుడి సంస్థకు కాంట్రాక్ట్​ కట్టబెట్టడంలో మతలబు ఏంటి' - జగన్​పై చంద్రబాబు కామెంట్స్

ప్రజల ప్రాణాలను నిలబెట్టే 108 అంబులెన్స్​ల నిర్వహణ కాంట్రాక్టులో స్కామ్ జరగడం సిగ్గుచేటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. గత ఒప్పందం ప్రకారం బీవీజీ సంస్థకు 2020 డిసెంబర్‌ 12 వరకు కాలపరిమితి ఉన్నా..2019 సెప్టెంబర్‌ 20న కొత్త ఏజెన్సీ కోసం జీవో ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు.

chandrababu comments on 108 ambulance scam

author img

By

Published : Jun 22, 2020, 6:06 PM IST

108 అంబులెన్స్‌ల నిర్వహణ కాంట్రాక్టులో స్కామ్ జరగడం సిగ్గుచేటని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బీవీజీ సంస్థతో అంబులెన్స్ నిర్వహణ ఒప్పందం అమలులో ఉండగానే.. 10 నెలల ముందుగా 2020 ఫిబ్రవరి 13న జీవో 116తో ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేశారని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు.

ఫైనాన్స్‌ విధానంలో కొనుగోలు చేయగలిగిన అంబులెన్సులను జీవో 117తో నేరుగా డబ్బులు చెల్లించి ఎందుకు కొన్నారని ధ్వజమెత్తారు. ఒక్కొక్క పాత అంబులెన్సుకు 47 వేల రూపాయలు, కొత్త అంబులెన్సుకు 90 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు పెంచి వైకాపా ఎంపీ అల్లుడికి చెందిన సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టడంలో మతలబు ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి జరిగిందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలని నిలదీశారు. అంబులెన్స్ స్కామ్ వెలుగులోకి వస్తే అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం... కుంభకోణాన్ని బయటపెట్టిన తెలుగుదేశం నేత పట్టాభిరామ్​పై వేధింపులకు దిగి గృహ నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: అయ్యన్నపాత్రుడిపై కేసు: అరెస్టుపై స్టే ఇచ్చిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.