ETV Bharat / city

సీఎం జగన్.. రౌడీలు, సంఘ విద్రోహశక్తులను తయారు చేస్తున్నారు: చంద్రబాబు - తెదేపాపై దాడులను ఖండించిన చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్.. రౌడీలు, సంఘ విద్రోహశక్తులను తయారు చేస్తున్నారని.. ఇష్టానుసారం వారిని సమాజంపైకి వదిలే పరిస్థితికి వచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వేధించడం, భయభ్రాంతులకు గురి చేసి వారికివారే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులు, రాజకీయ పార్టీలను తన నలభైఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని.. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని, న్యాయం నిలబడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

chandra babu naidu fire on ycp
సీఎం జగన్.. రౌడీలు, సంఘ విద్రోహశక్తులను తయారు చేస్తున్నారు
author img

By

Published : Feb 2, 2021, 10:10 PM IST

తెదేపా అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని తన నివాసానికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. పట్టాభిపై దాడి అతిదారుణం, కిరాతకమని అన్నారు. పట్టాభిపై దాడిని ఖండించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వంపై, ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలపై సాక్ష్యాధారాలతో పట్టాభి నిలదీస్తున్నందునే దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

గూండాల మాదిరి తయారయ్యారు..

ముఖ్యమంత్రి జగన్, కొందరు మంత్రులు.. రౌడీలు, గూండాల మాదిరి తయారయ్యారని విమర్శించారు. పట్టాభి పార్టీ కార్యాలయానికి వస్తుంటే, రెక్కీ నిర్వహించి మారణాయుధాలతో దాడి చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ దొంగలు, సంఘవిద్రోహశక్తులు, రౌడీలు వచ్చినా నిమిషంలో కనిపెట్టి, ట్రాక్ చేసే విధానాన్ని ఏర్పాటు చేశామని.. వాటి సద్వినియోగంలో డీజీపీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పట్టాభి ఎవరికి శత్రువు? అని.. ప్రజల తరుపున పోరాడటమే ఆయన చేస్తోందన్నారు. తప్పులను సరిదిద్దుకొని ముందుకుసాగాల్సిన ప్రభుత్వం ఉన్మాదులతో దాడి చేయిస్తుందా? అని చంద్రబాబు నిలదీశారు.

నా నలభై ఏళ్ల రాజకీయంలో చూడలేదు..

తన నలభై ఏళ్ల నుంచి రాజకీయాలు చూస్తున్నానని.. తమ హయాంలో ఎక్కడైన రౌడీయిజం జరిగిందా? దాడులు జరిగాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పట్టాభి కారుపై తొలుత దాడిజరిగినప్పుడే చర్యలు తీసుకున్నా, నిందితులను పట్టుకున్నా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని.. ప్రజల పన్నులతో జీతం తీసుకుంటూ వారి భద్రతను విస్మరిస్తున్నారని డీజీపీపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రశ్నింస్తే కేసులా..

అచ్చెన్నాయుడి అరెస్ట్ బరితెగింపు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. చేయని నేరానికి ఆయనపై కేసుపెట్టి, 70, 80రోజులపాటు జైల్లో పెట్టారన్నారు. ఊరిపై దాడిచేసి, అచ్చెన్నాయుడిపై కేసుపెడతారా? అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు అడిగిన విధానంలో ఏచిన్న తప్పున్నా, ఏ సెక్షన్ కింద ఆయన తప్పుచేశాడో చెప్పాలని డీజీపీని ప్రశ్నించారు.

సీఎంగా కొనసాగడానికి అర్హత లేదు..

ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు శాంతిభద్రతలు కాపాడాలని.. అలా చేయలేకపోతే సీఎంగా ఈ రాష్ట్రానికి ఉండటానికి అర్హత లేదని చంద్రబాబు అన్నారు. జవాబుదారీ తనం పౌరులు, రాజకీయపార్టీలకే కాదు, పోలీసులకూ ఉండాలన్నారు. రౌడీలు, సంఘవిద్రోహశక్తులు, బూతులుతిట్టే వ్యక్తులను ప్రోత్సహిస్తే రక్షణ ఉండదని అన్నారు. ఇది తెదేపా, వైకాపాకి వ్యక్తిగత పోరాటం కాదన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తే, అసలు ప్రతిపక్షం ఉండకూడదు, ప్రజలు ఉండకూడదు.. న్యాయవ్యవస్థ చెబితే వారు ఉండకూడదు, మీడియా రాయకూడదు ఇలాంటి వికృతమైన చేష్టలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారని.. అందుకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయని అన్నారు.

ఇదీ చదవండి:

గూఢచారులు గుట్టుగా ఓటేయొచ్చు.. తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.