ETV Bharat / city

WEATHER UPDATE: పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు - బంగాళాఖాతంలో వాయుగుండం వార్తలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4 గంటల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు(heavy rains) కురిసే అవకాశం ఉందన్నారు.

WEATHER UPDATE
WEATHER UPDATE
author img

By

Published : Nov 19, 2021, 5:32 AM IST

Updated : Nov 19, 2021, 6:57 AM IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

భారీ వర్షాలు..

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు(heavy rains) కురుస్తాయని, ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయని చెప్పారు.

చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కళ్యాణి జలాశయానికి వరదనీరు పోటెత్తింది. కళ్యాణి జలాశయం 3 గేట్లను అధికారులు ఎత్తారు. స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

చెరువుల్లా రహదారులు..

తిరుపతిలో వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు.. స్కావెంజర్స్ కాలనీ, ఎల్బీనగర్‌ హైస్కూల్‌లో.. ఎమ్మార్‌పల్లి కేశవరెడ్డి స్కూల్‌, పద్మావతిపురంలోని హైస్కూల్‌, యశోధనగర్‌లోని లిటిల్ ఏంజెల్స్​లో భోజన వసతి కల్పించారు.

విరిగిపడ్డ కొండ చరియలు..

భారీ వర్షాల కారణంగా తిరుమల రెండో కనుమ రహదారిని తితిదే అధికారులు మూసివేశారు. రెండో కనుమ రహదారిలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. మొదటి కనుమ రహదారిలోనే భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు.

ఉద్ధృతంగా జలాశయాలు..

కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పింఛ, అన్నమయ్య జలాశయాలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. సుండుపల్లి వద్ద పింఛ ప్రాజెక్టు మట్టికట్ట 3 మీటర్ల మేర కోతకు గురైంది. పింఛ నుంచి అన్నమయ్య ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అన్నమయ్య ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి 1.5 లక్షల కూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లపై నుంచి 2 మీటర్ల మేర ప్రవాహం ప్రవహిస్తోంది.

అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కోతకు గురి కావడంతో లోతట్టు ప్రాంతాల వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. వెలిగళ్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాపాగ్నికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కమలాపురంలో పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో కుమ్మరవీధి, ఏకలవ్య నగర్ వాసులు ఆందోళనకు గురయ్యారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి

rains: కనుమదారుల్లో విరిగిపడిన కొండచరియలు... చెరువును తలపించిన శ్రీవారి ఆలయం

Last Updated : Nov 19, 2021, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.