ETV Bharat / city

CS Service Extension: సీఎస్ ఆదిత్యనాథ్ పదవీ కాలం పొడిగింపు

సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్ సర్వీసు 3 నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30తో ఆయన పదవీ కాలం ముగియనుండగా.. ప్రభుత్వ అభ్యర్థన మేరకు సెప్టెంబరు 30 వరకు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.

central orders issue to  CS Adityanath das service extension
సీఎస్ ఆధిత్యనాథ్ పదవీ కాలం పొడగింపు
author img

By

Published : Jun 26, 2021, 7:37 PM IST

Updated : Jun 26, 2021, 9:31 PM IST

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సర్వీసును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధన మేరకు ఆదిత్యనాథ్ దాస్ సర్వీసును 2021 జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకూ పొడిగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శి కుల్దీ​ప్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఏడాది జూన్ 30 తేదీతో ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండటంతో ఆయన సర్వీసును పొడిగించాల్సిందిగా..సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని రూల్ 16 (1) ప్రకారం మూడు నెలల పాటు సర్వీసు పొడిగిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.

ఇదీచదవండి

Exams: పరీక్ష ఫలితాలకు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ: మంత్రి సురేశ్

Last Updated : Jun 26, 2021, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.