తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 21 వరకుకేంద్ర పర్యటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి.. జన ఆశీర్వాద యాత్రను చేపట్టనున్నారు. కేంద్రంలో భాజపా పాలన వచ్చి ఏడేళ్లు పూర్తైన సందర్భంగా యాత్ర చేపట్టారు. ఈ ఏడేళ్లలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. మూడురోజుల పాటు 305 కిలోమీటర్ల మేర జన ఆశీర్వాద యాత్ర సాగనుంది.
12 జిల్లాలు 17 అసెంబ్లీ, 8 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్రను చేపట్టనున్నారు. అందులో భాగంగా నేడు విజయవాడలో కేంద్రమంత్రి పర్యటించనున్నారు. ఉదయం 11.15కు గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్న కిషన్ రెడ్డి.. 11.30 గంటలకు విమానాశ్రయం నుంచి కార్లు, బైక్ల ర్యాలీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో జన ఆశీర్వాదయాత్ర సభలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు తుర్లపాటి కుటుంబరావు కుటుంబాన్ని కేంద్ర మంత్రి పరామర్శిస్తారు. అనంతరం 1.40 గంటలకు విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు స్థానికంగా ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శిస్తారు.
ఇదీ చదవండి: