ETV Bharat / city

bjp office: భాజపా కార్యాలయాల వద్ద సంబరాలు - భాజపా కార్యాలయాల వద్ద సంబరాలు

celebrations at state bjp office: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సందర్భంగా రాష్ట్ర భాజపా కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. నాయకులు స్వీట్లు పంచి అభినందనలు తెలుపుకున్నారు. భారతదేశానికి మేలు చేసే ఏకైక పార్టీ భాజపా అని, అది ప్రజలు గ్రహించారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ.

celebrations at  bjp office
భాజపా కార్యాలయం వద్ద సంబరాలు
author img

By

Published : Mar 10, 2022, 5:03 PM IST

Updated : Mar 10, 2022, 8:37 PM IST

celebrations at state bjp office: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలుగు చోట్ల భాజపా విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర భాజపా కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. భాజపా రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు స్వీట్లు పంచి అభినందనలు తెలుపుకున్నారు. సంబరాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు. రాజధాని రైతులు సోము వీర్రాజును‌ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

భాజపా కార్యాలయం వద్ద సంబరాలు

tg venkatesh: భారతదేశానికి మేలు చేసే ఏకైక పార్టీ భాజపా అని, అది ప్రజలు గ్రహించారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కర్నూలులో అన్నారు. దేశంలో ఐదు రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాల సందర్భంగా నాలుగు రాష్ట్రాల్లో భాజపా విజయం సాధించడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీలు సైతం ఓట్లు వేశారని ఆయన తెలిపారు. భారతదేశానికి భాజపా నాయకత్వం అవసరమని ఆయన తెలిపారు.

భారతదేశానికి మేలు చేసే ఏకైక పార్టీ భాజపా

kanna: దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే నాలుగు చోట్ల దూసుకెళ్లిందన్నారు. ముఖ్యంగా ఉత్తర్​ప్రదేశ్​లో వరుసగా రెండో సారి అధికారంలోకి రావటం కొత్త చరిత్రగా అభివర్ణించారు. మోదీ, యోగి డబుల్ ఇంజిన్ మాదిరిగా యూపీ అభివృద్ధికి తోడ్పడ్డారు కాబట్టే అక్కడ గెలుపు సాధ్యమైందన్నారు. అవినీతి రహిత అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మోదీ చేస్తున్న కృషికి ప్రజలు వెన్నంటి నిలిచారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఈ ఫలితాలపై ఆలోచించాలని కోరారు. ప్రాంతీయ పార్టీలు పెట్టుబడి పెట్టి అధికారంలోకి రావటం తప్ప ప్రజలకు ఏమీ చేయటం లేదని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనం

కర్నూలులో సంబరాలు

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సందర్భంగా నాలుగు రాష్ట్రాల్లో భాజపా విజయం సాధించడంతో పార్టీ నేతలు కర్నూలులో విజయెత్సవ ర్యాలీ చేశారు. హోటల్ మౌర్య నుంచి రాజ్ విహర్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. బాణా సంచా కాల్చి బీజేపీ నాయకులు మిఠాయిలు పంచుకున్నారు.

కర్నూలులో విజయెత్సవ ర్యాలీ

జమ్మలమడుగులో కమల దళం సంబరాలు

ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో 4 రాష్టాలలో కమలం పార్టీ ఘన విజయం సాధించినందుకు నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గురువారం ఫలితాలు వెలువడిన తర్వాత కడప జిల్లా జమ్మలమడుగులో భాజపా కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ కూడలి వద్ద టపాసులు కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచి పెట్టారు. ప్రధాని మోదీ నీతి,నిజాయితీ పాలనకు ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారని భాజపా నాయకుడు మోహన్ రెడ్డి తెలిపారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణరెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోను, కడప జిల్లాలోను పార్టీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విజయవాడలో గెలుపు సంబరాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన సందర్భంగా విజయవాడ పటమటలో పార్టీ రాష్ట్ర శాఖ విజయోత్సవ సంబరాలు నిర్వహించింది. ఈ సంబరాల్లో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి డప్పులు కొట్టి, మిఠాయిలు పంచిపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్​గా భావించే ఎన్నికల్లో కమల దళం ప్రభంజనం సృష్టించి నాలుగు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించిందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకున్న పార్టీగా రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రపంచానికి భారతదేశాన్ని ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు. మోదీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భాజపా ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందన్నారు. అవినీతి రహిత పాలన సాగించడం వల్ల ప్రజలు నాలుగు రాష్ట్రాల్లో పట్టం కట్టారని మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి తెలిపారు. వాక్సిన్ విషయంలో సైతం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు.

విజయనగరంలో పండుగ వాతావరణం

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ విజయంపై విజయనగరంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. విజయనగరంలోని కోట కూడలిలో భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకుని విజయోత్సవ వేడుకలు జరిపారు. పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో భాజపా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్​ప్రదేశ్​లో వరుసగా రెండోసారి భాజపా అధికారం చేపట్టడం విశేషమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ 'ముక్త్ కాంగ్రెస్' నినాదానికి ప్రజల ఆమోదం లభించిందన్నారు. దేశ రాజకీయ చిత్రపటంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం మరెంతో దూరంలో లేదని అన్నారు. దేశ ప్రజలు నీతి, నిబద్ధత కలిగిన పాలనను కోరుకుంటున్నారు అనడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనం అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపుతాయన్నారు. ముఖ్యంగా ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కుటుంబ పార్టీలకు చెంపపెట్టు వంటిదని ఆమె పేర్కొన్నారు

పాడేరులో ఆనందాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు చోట్ల భారతీయ జనతాపార్టీ ఘనమైన గెలుపు లభించడంతో భాజపా వర్గాల్లో ఆనందోత్సవాలు నిండుకున్నాయి. పాడేరులో భాజపా శ్రేణులు విజయోత్సవ ర్యాలీ చేసి ప్రధానమంత్రిని కొనియాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయ దుందుభి మోగించిన సందర్భంగా విశాఖలో పార్టీ నేతలు పండగ చేసుకున్నారు. మాజీ శాసన సభ్యుడు విష్ణు కుమార్ రాజు ఇంటి వద్ద బాణసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం కార్యాలయంలో విజయ భాజాలు వాయించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ చేస్తూ సందడి చేశారు. ఉత్తర ప్రదేశ్, గోవా ఇతర ప్రాంతాల్లో మంచి ఫలితాలు సాధించిందని,భవిష్యత్తులో మరోసారి భాజపా హవా కొనసాగిస్తుందని చెప్తూ సంబర పడుతున్నారు.

ఇదీ చదవండి: 'సాధారణ వైద్య విద్యార్థులతో సమానంగా గౌరవ వేతనం ఇవ్వాలి'

Last Updated : Mar 10, 2022, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.