ETV Bharat / city

వైకాపా అరాచకాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: చంద్రబాబు - ఏపీలో పంచాయతీ ఎన్నికలు

వైకాపా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన దానికంటే ప్రతి కుటుంబం వద్ద 2లక్షల వరకూ పన్నులు, అప్పుల భారం మోపిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పంచాయితీ ఎన్నికలు..... వైకాపా అరాచకాలకు బుద్ధి చెప్పేవి కావాలన్నారు. జగన్‌ కేసు మాఫీకే వైకాపా మందబలం పనిచేస్తోందని, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు.

పంచాయతీ ఎన్నికలతో వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట

author img

By

Published : Jan 29, 2021, 9:44 PM IST

Updated : Jan 30, 2021, 2:28 AM IST

పంచాయితీ ఎన్నికల తొలిదశ ప్రాంతాల పార్టీ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకాపా అధికారం చేపట్టాక ఈ 20నెలల్లో ఏ ఊళ్లోనూ ఒక్కపనీ జరగలేదని..... కనీసం రోడ్లపై గుంతలూ పూడ్చలేదని విమర్శించారు. సక్రమంగా తాగునీరు ఇవ్వకపోగా... తాము అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు రద్దు చేశారని ఆగ్రహించారు. నరేగా, సూక్ష్మసేద్యం నిధులు ఇవ్వలేదని, ఆదరణ పరికరాలూ అందించలేదని మండిపడ్డారు. అమ్మఒడి ద్వారా ఇచ్చింది..... నాన్న బుడ్డి ద్వారా లాక్కుంటున్నారని ఆక్షేపించారు. గడిచిన 20 నెలల్లో ప్రతి కుటుంబానికీ ఇచ్చిన దానికన్నా... మోపిన పన్నులు, అప్పుల భారం సరాసరి 2 లక్షల దాకా ఉందన్నారు. ప్రత్యేక హోదా సహా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. 28 మంది ఎంపీలు జగన్‌ కేసుల మాఫీ కోసం తప్పితే రాష్ట్రం కోసం పని చెయ్యట్లేదని విమర్శించారు.

రక్షణ కవచంగా నిలవాలి...

గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కవచంగా తెలుగుదేశం శ్రేణులు నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యువత, మహిళలను ప్రోత్సహిస్తూ బడుగు బలహీన వర్గాల్లో నాయకత్వం పెంచుకోవాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా వైకాపా సృష్టించిన హింసా విధ్వంసాలను ఎవ్వరూ మర్చిపోరని..... వాటికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. తెలుగుదేశం శ్రేణులకు.. గ్రామాభివృద్ధే కర్తవ్యం కావాలన్నారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, దాడులకు ఈ ఎన్నికలతో అడ్డుకట్ట వేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు అభ్యర్థులంతా పోటీ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నందున.. ప్రతిపౌరుడూ రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

అన్యాయం జరిగితే ఊరుకోబోం...

ఎన్టీఆర్ కల్పించిన హక్కు ద్వారా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పొందిన రైతులకు అన్యాయం జరిగితే చూస్తే ఊరుకోబోమని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్థితిలోనూ మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని అనుమతించబోమన్నారు. ఇళ్ల స్థలాల్లో 6 వేల 500 కోట్ల అవినీతికి వైకాపా నేతలు పాల్పడ్డారని... ఇసుక, సిమెంట్, మద్యంలో జేట్యాక్స్ పేరుతో పేదల జేబులు గుల్ల చేశారని ధ్వజమెత్తారు. ఇసుక దొరక్క ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కూలీలు, రైతులే వైకాపాకు పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

సిమెంటు రోడ్లు, ఎల్ఈడీ వీధి దీపాలు సహా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు గ్రామాల్లో కళ్లెదుటే ఉన్నాయన్న చంద్రబాబు... పల్లె ప్రగతి-పంచ సూత్రాలు, పల్లెలు మళ్లీ వెలగాలి’కరపత్రాలను ప్రతి ఇంటికీ పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. బలవంతపు ఏకగ్రీవాలను.. డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకోవాలన్నారు. ఎన్నికల అధికారుల నుంచి అక్నాలడ్జ్ మెంట్ తో సహా తాజా ఓటర్ జాబితాను అభ్యర్థులంతా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ఇదీచదవండి...

బలవంతపు ఏకగ్రీవాలు చేసేవారిపై షాడో బృందాల నిఘా: ఎస్​ఈసీ

Last Updated : Jan 30, 2021, 2:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.