ముఖ్యమంత్రి జగన్ తన అసమర్థత పాలనతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్లో కరోనా రోగి మృతి బాధాకరమన్నారు. రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి సోదరుడిని ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు.. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
సకాలంలో ఆక్సిజన్ అందక, ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు పడకలు లభించక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. "ఇప్పటికైనా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో పరిశీలించాలి" అని హితవు పలికారు. అలసత్వం వీడి ప్రతి ఒక్కరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: