ETV Bharat / city

ఆత్మకూరు ఉపఎన్నికపై వైకాపా సవాళ్లు నీచం: చంద్రబాబు - ఆత్మకూరు వార్తలు

Babu on Atmakur bypoll: రివర్స్ టెండర్ల విధానంతో పోలవరం ప్రాజెక్టును రివర్స్ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆత్మకూరు ఉపఎన్నికపై వైకాపా సవాళ్లు నీచంగా ఉన్నాయన్నారు. చనిపోయిన కుటుంబసభ్యులకే సీటు ఇస్తే.. పోటీ వద్దనేది తెదేపా విధానమని గుర్తు చేశారు.

ఆత్మకూరు ఉపఎన్నికపై వైకాపా సవాళ్లు నీచం
ఆత్మకూరు ఉపఎన్నికపై వైకాపా సవాళ్లు నీచం
author img

By

Published : Jun 2, 2022, 6:13 PM IST

Babu on YSRCP: ఆత్మకూరు ఉప ఎన్నికపై వైకాపా కనీస సంస్కారం లేకుండా మాట్లాడిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చనిపోయిన కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికలో సీటు ఇస్తే... పోటీ పెట్టకూడదనేది తెలుగుదేశం విధానమని గుర్తు చేశారు. అందుకే ఆత్మకూరులో పోటీ పెట్టలేదని స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. రివర్స్ టెండర్ల విధానంతో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును రివర్స్ చేశారని మండిపడ్డారు.

డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ఈ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ధ్వజమెత్తారు. పోలవరం పనులు చేస్తున్న ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం చెప్పిన సూచనలను పాటించకపోవడం వల్లే అనర్థం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంలో డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి నూరు శాతం ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ప్రజలు, ఉద్యోగులపై దాడులు చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏఈ సూర్యకిరణ్​పై దాడి చేయటం దారుణమన్నారు. స్వయంగా ప్రజాప్రతినిధులు, వైకాపా మూకలు అధికారులపై దాడులు చేస్తుంటే సీఎం మౌనం దేనికి సంకేతమని నిలదీశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.