ETV Bharat / city

'మనమున్నది ప్రజాస్వామ్యంలోనా.. నియంత రాజ్యంలోనా..?' - చంద్రబాబు తాజావార్తలు

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెచ్చుమీరాయని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా, నియంత రాజ్యంలోనా..? అని నిలదీశారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ సర్పంచ్ అవినాశ్ ఆత్మహత్యాయత్నం వైకాపా ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు.

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్
author img

By

Published : Mar 6, 2020, 11:54 PM IST

చంద్రబాబు ట్వీట్

మనమున్నది ప్రజాస్వామ్యంలోనా, నియంత రాజ్యంలోనా ? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ సర్పంచ్ అవినాశ్ ఆత్మహత్యాయత్నం వైకాపా ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ఎంత తీవ్ర మానసిక హింసకు గురైతే.. పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారో తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై పోలీసుల ఒత్తిడి తీవ్రతకు ఇది అద్దం పడుతోందని దుయ్యబట్టారు.

పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు

చట్టాలకు పాతరేసి, నిబంధనలను గాలికొదిలేసి పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. తెదేపా వాళ్లందరినీ చంపేయమని వైకాపా ప్రభుత్వం చెప్పిందా..? అని చంద్రబాబు నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు పెచ్చరిల్లాయని ధ్వజమెత్తారు. బాధిత ప్రజానీకానికి అండగా ఉండాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడటం గర్హనీయమన్నారు. కంచె చేను మేయడం అంటే ఇదేనని.. భద్రత కల్పించాల్సిన రక్షణ నిలయాలే అభద్రతకు నెలవులైతే కలిగే దుష్ఫరిణామాలు ఇలాగే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ సర్పంచిగా పనిచేసిన అవినాశ్​ను ఇంతగా భయభ్రాంతులకు గురిచేశారంటే, ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ విధమైన అరాచకాలను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలంటూ ట్విటర్ వేదికగా కోరారు.

ఇదీ చదవండి:

పోలీస్​ స్టేషన్​పై నుంచి దూకిన మాజీ సర్పంచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.