ETV Bharat / city

జగన్​ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్ఛవమైంది: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పడలేక ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఆగడాలపై ఎస్ఈసీ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు.

జగన్​ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్ఛవమైంది

author img

By

Published : Feb 28, 2021, 11:54 AM IST

మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాతో పోటీ పడలేక వైకాపా నాయకులు ఆస్తుల విధ్వంసానికి దిగటం సిగ్గుచేటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను కబ్జా చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియనూ కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తిరుపతిలో 20 ఏళ్లుగా టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు దుకాణాన్ని అక్రమంగా తొలగించటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. పలాసలో బెదిరింపులకు గురి చేసి.. తమ అభ్యర్థులను వైకాపాలో చేర్చుకున్నారని ఆరోపించారు. పోటీ నుంచి తప్పుకోకపోతే తెదేపా అభ్యర్థులపై వైకాపా విష పంజా విసురుతోందన్నారు. జగన్​ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్ఛవమైందని.. జగన్ ఆదేశాలతోనే రాష్ట్రంలో ఇలాంటి వికృత చేష్టలకు వైకాపా నాయకులు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.

అధికార పార్టీ ఆగడాలపై ఎస్ఈసీ ఎందుకు స్పందించటం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ఎస్ఈసీ, పోలీసులపై ఉందన్నారు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎన్నికలయ్యే వరకు ఏం జరగుతుందో అంతుచిక్కని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

పట్టణాభివృద్ధి శూన్యమని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి: యనమల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.