ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అతిథి గృహంలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. వాకాటి ఒకటిన్నర సంవత్సరం నుంచి బెంగూళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఆగష్టు 14వ తేదిన కర్ణాటక హైకోర్టులో బైయిల్ పై వాదనలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో సీబీఐ అధికారులు నెల్లూరులో సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. వసతిగృహంలో ఉన్న వాకాటి పీఏ రామకృష్ణను అధికారులు రెండు గంటలకు పైగా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వాకాటికి చెందిన వియన్నార్ ఇన్ఫాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ 190 కోట్లు రుణం తీసుకుంది. తక్కువ విలువ కలిగిన ఆస్తులను ఎక్కువ విలువ చూపించి ఐఎఫ్.సీఐని మోసం చేశారనే అభియోగంపై 2018 జనవరి 21న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
వాకాటి 2017 మేలో తెదేపా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయనపై ఆర్థిక నేరారోపణలు రావడం, సీబీఐ విచారణ ప్రారంభం కావడంతో..పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.
వాకాటి అథిథి గృహంలో సీబీఐ సోదాలు
ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అతిథిగృహంలో సీబీఐ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. నెల్లురూలోని అతిథిగృహంలో కర్ణాటక నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది.