జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ ఛార్జిషీట్లు తేలిన తర్వాతే ఈడీ కేసుల విచారణ జరపాలన్న జగన్ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం...సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని తెలిపింది.
సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో నేరాభియోగాలు వేర్వేరని పేర్కొన్న ఈడీ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈడీ కేసులను ముందుగా విచారణ చేపడతామని వెల్లడించింది. ఈడీ కేసుల్లో అభియోగాల నమోదు కోసం విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీచదవండి