కేబుల్ ఆపరేటర్స్‌కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ కేబుల్ ఆపరేటర్ల ఐకాస డిమాండ్ చేసింది. తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ.. విజయవాడలో సమావేశం నిర్వహించారు. కేబుల్ ఆపరేటర్స్‌కు గుర్తింపు కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యం, పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని ఐకాస ప్రతినిధి సీతారామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లాక్ డౌన్ సమయంలో పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది తరహాలోనే ప్రజలు బయటకు రాకుండా ప్రేక్షకులకు వినోదం అందించేందుకు కేబుల్ ఆపరేటర్లు కృషి చేశారని చెప్పారు. కరోనాతో మృతి చెందిన కేబుల్ ఆపరేటర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు