విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో హోటల్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
బస్సు తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబరు కలిగిఉంది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌తో పాటు మరో 22 మంది ఉన్నారు. ప్రమాదంలో ప్రయాణికులకు ఏం కాలేదు. బస్సు బిహార్ నుంచి కేరళ వెళ్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి : శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి!