ETV Bharat / city

'నిర్మాణ రంగంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. ఒక్కరోజు విరామం' - సతమతమవుతుందన్న భవన నిర్మాణ రంగం

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు ఉంది.. భవన నిర్మాణ రంగ పరిస్థితి. కరోనా కారణంగా నత్తనడకన నడుస్తున్న ఈ రంగాన్ని.. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. నిర్మాణ రంగంలో ముడిసరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 9న ఒక్కరోజు విరామం ప్రకటించినట్లు క్రెడాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్​ చంద్రబోస్​ వెల్లడించారు.

building and developers protest
building and developers protest
author img

By

Published : Apr 9, 2022, 4:26 PM IST

భవన నిర్మాణ రంగం ఎన్నో సమస్యలతో సతమతమవుతోందని క్రెడాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుభాష్ చంద్రబోస్ అన్నారు. నిర్మాణ రంగంలో ముడిసరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా.. ఈ నెల 9న ఒక్కరోజు విరామం ప్రకటించినట్లు చంద్రబోస్​ వెల్లడించారు. క్రెడాయ్, నేరాడ్కో, చాంబర్ ఆఫ్ కామర్స్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలన్నీ ఈ విరామంలో పాల్గొంటాయని ఆయన తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్​లో మీడియా సమావేశం నిర్వహించారు.

కరోనా కారణంగా భవన నిర్మాణ రంగం ఎన్నో సమస్యలతో సతమతమవుతోందని.. కార్మికుల వలస కారణంగా నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయిపోయిందని సుభాష్​ చంద్రబోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముడి సరుకు లేనా స్టీల్, సిమెంట్​ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈ భారం అంతిమంగా కొనుగోలు ధరపై ప్రభావం చూపుతోందన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై దృష్టిసారించి ధరల పెరుగుదలను నియంత్రించాలని కోరారు. ఈ సమావేశంలో క్రెడాయ్ విజయనగరం ఛైర్మన్​ వి. పార్థసారథి, అధ్యక్షులు సీహెచ్ సూర్యనారాయణ రాజు, కార్యదర్శి కె. రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదంవడి:
construction traders: పవర్​ హాలిడేపై... నిర్మాణ రంగ వ్యాపారులతో ముఖాముఖి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.