ETV Bharat / city

Budha and Nagulmeera fired on Kodali: షర్మిల ఏపీలో పార్టీ పెడితే..చేరే తొలి వ్యక్తి కొడాలి నాని -బుద్ధా - కొడాలి నానిపై బుద్ధా వెంకన్న విమర్శలు

Budha and Nagulmeera fired on Kodali: షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెడితే, అందులో చేరి జగన్​ని తిట్టే మొదటి వ్యక్తి కొడాలి నాని అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు.

Budha and Nagulmeera fired on Kodali
కొడాలి నానిపై మండిపడ్డ బుద్దా, నాగుల్ మీరా
author img

By

Published : Jan 24, 2022, 1:07 PM IST

Budha and Nagulmeera fired on Kodali: షర్మిల ఆంధ్రప్రదేశ్​లో పార్టీ పెడితే, అందులో చేరి జగన్​ని తిట్టే మొదటి వ్యక్తి కొడాలి నాని అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రజలకు మేలు చేయటం చేతకాకే.. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడలో బస్సులు, లారీల్లో కొడాలి నాని ఆయిల్ దొంగతనం చేస్తే, అప్పుడు పోలీసు అధికారిగా ఉన్న వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం అయ్యాకే కొడాలి నానికి తెలుగుదేశంలో స్థానం దక్కిందని బుద్దా వెంకన్న గుర్తుచేశారు. హరికృష్ణ గుడివాడలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే, మధ్యలో వదిలేసి పారిపోయిన వ్యక్తి కొడాలి నాని అని విమర్శించారు. కొడాలి నాని కానీ.., మరెవ్వరైనా చంద్రబాబు గురించి మాట్లాడితే తాము పది రెట్లు మాట్లాడతామన్నారు. జోగి రమేష్‌లా మళ్లీ చంద్రబాబు ఇంటివైపు ఎవరైనా చూస్తే చావకొట్టి పంపుతామని వెంకన్న హెచ్చరించారు. డీజీపీకి కూడా కొడాలి నాని నిర్వహించిన క్యాసినోలో వాటాలు ఉన్నందుకే కేసు తొక్కిపెట్టారని మండిపడ్డారు. డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా డీజీపీ తీరుందని బుద్దా వెంకన్న ఆక్షేపించారు.

కొడాలి నాని భాషపై రాష్ట్రమంతా ఉమ్మేస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నాగుల్ మీరా విమర్శించారు. పిచ్చి ముదిరిన కొడాలి నానికి అత్యవసర మానసిక చికిత్స అవసరమని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి : MTF demands to close schools : పాఠశాలలకు సెలవులు ప్రకటించండి: మున్సిపల్ ఉపాధ్యాయుల ఫెడరేషన్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.