సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి సహకారం అందించాలని.. భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం డిమాండ్ చేశారు. ఈ తీర్పు ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని.. కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు మాత్రమే ప్రాణ భయం పేరుతో ప్రకటనలు చేస్తున్నాయని విమర్శించారు. కరోనా కీలక దశలోనూ రైతులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేశారనే విషయాన్ని ఉద్యోగులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే గ్రామాల అభివృద్ధి నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ అత్యవసర సమీక్ష.. సుప్రీం తీర్పుపై చర్చ