ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చులన్నీ కేంద్రం ఇస్తుంటే.. ఇక మీరు ఏం చేస్తారని సీఎం జగన్ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు(somu veerraju) ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన.. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి మొత్తం నిధులు తీసుకుని, తమ పేర్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా.. వారిని దోచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తిపన్నుల పెంపు, చెత్తపై పన్నుల విధింపును పార్టీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జనసేనతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి. sangam dairy : సంగం డెయిరీ కేసుపై అ.ని.శా. జిల్లా కోర్టులో విచారణ