నెక్లెస్ రోడ్లో సేద తీరుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దుండగులు దాడి చేశారు. భాజపా నేతల కారు అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురిపై రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
అంతకుముందు బండి సంజయ్ చిన్నపిల్లలతో కలిసి ఆటలు ఆడారు. ఉదయం నుంచి దేవాలయాల సందర్శన, హోమాల్లో పాల్గొన్న ఆయన... రాత్రి ఎనిమిది గంటల సమయంలో కొద్దిసేపు సేద తీరేందుకు నెక్లెస్ రోడ్‌కు వచ్చారు.
ఇదీ చూడండి: ఇదో ఫ్రాడ్ ప్రభుత్వం.. ఆయనో ఫేక్ సీఎం: చంద్రబాబు