మతి స్థిమితం లేని వ్యక్తులు చేశారనే ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని భాజపా నేత వామరాజు సత్యమూర్తి విమర్శించారు. గతంలోనూ పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేయడం, నెల్లూరులో రథం దగ్ధం, నిడదవోలులో బలవంతంగా మతమార్పిడి చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుడిపైనే కేసు నమోదు చేసి కొట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ తరహా సంఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రజల మనో భావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తే భాజపా తరఫున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: