కరోనా బాధితులకు వైద్యం అందిచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని భాజపా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థ అధ్వానంగా మారిందని ఆయన విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అదే వ్యవస్థతో సక్రమంగా పర్యవేక్షణ ఎందుకు చేయించలేకపోతోందని ప్రశ్నించారు.
"ఎన్నికలకు వాలంటీర్లను ఉపయోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం... కరోనా వస్తే బాధితుల తలుపులు ఎందుకు తట్టడం లేదు.. వైద్యం కోసం పేదలు అల్లాడిపోతున్నారు. ప్రజా ప్రతినిధులు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు కరోనా బారిన పడితే దానికి ముఖ్యమంత్రి జగనే పూర్తి బాధ్యత వహించాలి" అని షేక్ బాజీ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:
కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: సీపీఐ రామకృష్ణ