జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని పూర్తి చేస్తామని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. వాస్తవిక అంచనాలకు అనుగుణంగా చేయాలనేది తమ పార్టీ ఉద్దేశమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం సాంకేతిక పేరిట అంచనాలు పెంచిందన్నారు. పోలవరంలో అవినీతి జరిగిందని తాము నమ్ముతున్నామని.. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేసి వారు అనుకున్న గుత్తేదారునికి పనులు అప్పగించడం తప్ప ఏ గొప్ప పనీ జరగలేదన్నారు. పోలవరం విషయంలో పారదర్శకత పెంచాలన్నారు.
తెదేపా, వైకాపా రెండూ తమ స్వార్ధరాజకీయం కోసం పోలవరం ప్రాజెక్టును ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమైన చోట రాష్ట్ర ప్రభుత్వం ఒకే విధమైన విధానం అనుసరించాలన్నారు. అక్రమ కట్టడాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో కాకుండా స్పస్టమైన వైఖరి అమలు చేయాలని మాధవ్ కోరారు.
ఇవీ చదవండి...
రాష్ట్రంలో భాజపా బలపడుతుందనే విశ్వాసం ఉంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి