ETV Bharat / city

BJP LEADER VISHNU KUMAR : 'మద్యం, డబ్బులు పంచకుంటే.. వైకాపాకు 15 సీట్లూ రావు' - somu veerraju comments

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఇతర పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను ఆ పార్టీ నేత విష్ణు కుమార్ తిప్పికొట్టారు. కొత్త సంవత్సరంలోనైనా సీఎం బుద్ధి మారాలని అన్నారు. ప్రజల్లో వైకాపాపై వ్యతిరేకత పెరిగిందని పేర్కొన్నారు. దశలవారీ మద్య నియంత్రణ హామీలను వైకాపా ప్రభుత్వం తుంగలో తొక్కిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

సోము వీర్రాజు వ్యాఖ్యలపై పార్టీ నేతల ఆగ్రహం

author img

By

Published : Dec 31, 2021, 9:57 PM IST

రాష్ట్రంలో మద్యం ధరల గురించి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడితే.. ఆయన మీద ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ అన్నారు. రాజ్యాంగ విధానాలను అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తుంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్​లో మాత్రం అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల అరాచక పాలనను భరించామని, కొత్త సంవత్సరంలోనైనా సీఎం బుద్ధి మారాలని భగవంతుడిని కోరుతున్నానన్నారు. మద్యం, డబ్బులు పంచకుండా ఉంటే అధికార పార్టీకి 15 సీట్లూ రావని ఆక్షేపించారు.

రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్న ప్రభుత్వం...నేడు అర్ధరాత్రి వరకు బార్లకు ఎలా అనుమతి ఇచ్చింది. జగన్ పాలనలో ఒక్క ఇల్లూ కట్టించలేదు. ప్రజల్లో వైకాపాపై వ్యతిరేకత పెరిగింది. మంత్రి నారాయణ స్వామి వారి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. బెయిల్ మీద ఎక్కువ కాలం బయట ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. - విష్ణు కుమార్, భాజపా నేత

తుంగలో తొక్కారు..
మద్య నిషేధం, దశలవారీ మద్య నియంత్రణ హామీలను వైకాపా ప్రభుత్వం తుంగలో తొక్కిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రెండున్నరేళ్లు సొంత బ్రాండ్ లు అమ్మిన జగన్ సర్కార్.. ఇప్పుడు ప్రీమియం బ్రాండ్లు అమ్ముతామంటోందని ఎద్దేవా చేశారు. అటు.. భాజపాపైనా విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.70 రూపాయలకు అమ్మిస్తానని సోము వీర్రాజు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.