ETV Bharat / city

కొవాగ్జిన్ ట్రయల్స్‌ దశ పూర్తైన వెంటనే ఫేజ్-3: కృష్ణ ఎల్లా - కరోనా వైరస్ వ్యాక్సిన్ తాజా వార్తలు

భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తోన్న కొవాగ్జిన్​లో అల్ హైడ్రాక్సిక్విమ్-2 అనే కారకం ఉండటం వల్ల మెరుగైన వ్యాధి నిరోధకశక్తినివ్వటమే కాక, ఎక్కువ కాలం హానికారక కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. ప్రస్తుతం వాక్సిన్ కాండిడేట్ ఫేస్-2 హ్యుమన్ ట్రయల్స్ దశలో ఉందని.. ఇది పూర్తయిన వెంటనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులతో ఫేస్-3 ప్రారంభిస్తామని తెలిపారు.

bharat-biotechs-covid19-vaccine-to-use-virovaxs-adjuvant-for-longer-lasting-immunity-on-human-body
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/05-October-2020/9054353_1018_9054353_1601886890140.png
author img

By

Published : Oct 5, 2020, 3:14 PM IST

భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తోన్న కొవాగ్జిన్ వాక్సిన్ ప్రపంచ ప్రమాణాలకు దీటుగా తీసుకువస్తున్నట్టు సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా ప్రకటించారు. కొవాక్జిన్‌ వ్యాక్సిన్‌లో అల్ హైడ్రాక్సిక్విమ్-2 అనే కారకం చేర్చటం వల్ల దాని పనితీరు మరింత మెరుగవుతుందని, తద్వారా దీర్ఘకాలం పాటు వైరస్‌ వ్యాప్తి చెందకుండా కాపాడుతుందని తెలిపారు. ప్రస్తుతం వాక్సిన్ కాండిడేట్ ఫేస్-2 హ్యుమన్ ట్రయల్స్ దశలో ఉందని.. ఇప్పటి వరకూ పూర్తి సానుకూల ఫలితాలు సాధిస్తోందని సంస్థ వెల్లడించింది.

వ్యాక్సిన్‌ను మెరుగైన రీతిలో ఆవిష్కరిస్తున్నాం..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సిన్ల ఫలితాలపై భిన్న కథనాలు వెలువడుతున్న సమయంలో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో ప్రపంచ స్థాయి ట్రాక్ రికార్డు ఉన్న తాము కరోనా వైరస్‌ నియంత్రణకు తయారు చేస్తున్న కొవాక్జిన్‌ సైతం అదే స్థాయిలో ఉంటుందని సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా ధీమా వ్యక్తం చేశారు. భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కొవాక్జిన్‌ వ్యాక్సిన్‌లో అల్‌హైడ్రాక్సిక్విమ్‌-2 అనే కెమికల్‌ కాంపోనెంట్‌ను చేర్చటం ద్వారా వ్యాక్సిన్‌ను మెరుగైన రీతిలో ఆవిష్కరిస్తున్నామన్నారు. తద్వారా శరీరంలో బలమైన రోగనిరోధక శక్తిని ఇవ్వటంతో పాటు దీర్ఘకాలం వ్యాధి బారిన పడకుండా అడ్డుకుంటుందని విశ్లేషించారు.

అడ్జువెంట్ కారకాల అభివృద్ధి ఇప్పుడు అత్యవసరం

వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ బయోటెక్​తో భాగస్వామ్యమైన వైరో వ్యాక్స్‌ కన్సాస్‌ నుంచి పొందిన ఈ ప్రత్యేక కారకాన్ని తొలి నుంచే తాము కొవాక్జిన్​లో పొందుపరిచామని తెలిపారు. దాని ఫలితాలు ఇప్పడు ఆశాజనకంగా ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం వాక్సిన్ కాండిడేట్ ఫేస్-2 హ్యుమన్ ట్రయల్స్ దశలో ఉందని.. ఇది పూర్తయిన వెంటనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులతో ఫేస్-3 ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. వ్యాక్సిన్​లో ఈ రకమైన అడ్జువెంట్ కారకాల అభివృద్ధి ఇప్పుడు అత్యవసరమని.. వీటి ద్వారా శరీరంలో ప్రతిరక్షకాలు వేగంగా వృద్ధి చెంది వ్యాధికారక వైరస్​ల నుంచి రక్షణ కల్పిస్తాయని పేర్కొన్నారు. తద్వారా వాక్సిన్ ఇమ్యునాలజీ మరింత బలపడుతుందని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు.

బలమైన వ్యాధినిరోధకశక్తిని అందిస్తుంది..

విశ్వవ్యాప్తంగా సార్స్ కో- 2 వ్యాక్సిన్ ఉత్పత్తికి వినియోగిస్తోన్న అల్యూమినియం హైడ్రాక్సైడ్ కారకానికి మరో రసాయనం ఇమైడా జోక్వినోలిన్ కారకాన్ని తాము జోడించామని.. తద్వారా తాము ఉత్పత్తి చేసే కొవాక్జిన్ వాక్సిన్ వైరస్, బాక్టీరియాల నుంచి రక్షణతో పాటు బలమైన వ్యాధినిరోధకశక్తిని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఏపీలో ప్రజాప్రతినిధులపై 132 కేసులు పెండింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.