విజయవాడ మేయర్ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి పేరు ఖరారైనట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. 46వ డివిజన్ కార్పొరేటర్‌గా భాగ్యలక్ష్మి ఎన్నికల్లో విజయం సాధించింది. మేయర్ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి పేరును మిగతా సభ్యులు ప్రతిపాదించారని మంత్రి వెల్లడించారు. రేపు అధికారికంగా మేయర్, డిప్యూటీ మేయర ఎంపిక జరగనుంది.
ప్రతిష్టాత్మకంగా భావించిన విజయవాడ నగరపాలికలో వైకాపా తిరుగులేని ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. నగరంలోని 64 డివిజన్లలో 49 స్థానాలను గెలుచుకొని విజయకేతనం ఎగురవేసింది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా నుంచి 14 మంది గెలుపొందారు.
ఇదీ చదవండి