ఇదీ చదవండి:
హైకోర్టు తరలింపును వ్యతిరేకిస్తూ... న్యాయవాదుల ఆందోళన - అమరావతి తాజా వార్తలు
హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ధర్నాకు దిగారు. హైకోర్టు తరలింపునకు నిరసనగా ఈ నెల 20వ తేదీ వరకూ రిలే నిరాహార దీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
బెడవాడ బార్ అసోసియేషన్ నిరసన దీక్ష
రాజధాని, హైకోర్టులను అమరావతి నుంచి తరలించవద్దని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసన తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్.. విజయవాడ సివిల్ కోర్టు ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నేటి నుంచి 20వ తేదీ వరకూ నిరసన దీక్షలు కొనసాగిస్తామని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ తెలిపారు. అమరావతి రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపారు. హైకోర్టు తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమం కొనసాగిస్తామన్నారు. హైకోర్టు తరలింపుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉత్తరాలు ద్వారా తమ ఆవేదన తెలియజేస్తామన్నారు. దిల్లీ వెళ్లి ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రాలు అందిస్తామని న్యాయవాదుల జేఏసీ ఛైర్మన్ తలసాని అజయ్ వెల్లడించారు.
ఇదీ చదవండి:
sample description