CONGRESS LEADERS: ప్రధాని పర్యటన సందర్భంగా నల్లబెలూన్లు ఎగురవేసి అరెస్టైన కాంగ్రెస్ నేతలకు.. బెయిల్ మంజూరైంది. తమ హక్కులు కోసం పోరాడటం ప్రజసామ్య హక్కు అని.. దాన్ని ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు. ఈ ముఖ్యమంత్రికి అల్లూరి సీతారామరాజు విగ్రహం తాకితే కొంచెమైనా ధైర్యం వచ్చి ప్రధానమంత్రిని ప్రత్యేక హోదాపై అడుగుతారేమో అనుకున్నామని.. ధైర్యం కాదు కదా సిగ్గు లేకుండా మంత్రి రోజా, ముఖ్యమంత్రి కలిసి మోదీతో సెల్ఫీలు దిగుతున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి విభజన బిల్లులు, ప్రత్యక హోదా గురించి ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుంకరపద్మశ్రీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే లేరని విమర్శించారు. ఇప్పటికైనా మోదీ కాళ్ల దగ్గర మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం మానేయాలని హెచ్చరించారు. కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదా, విభజన బిల్లులు ఏవి అని ప్రశ్నించినందుకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో గతంలో నరేంద్రమోదీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందే కదా.. ఇప్పుడు తాము అడిగిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు అన్నారు.
ఇవీ చదవండి: